- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Uppal: ఉప్పల్‌లో పబ్బులు, బార్లు, రెస్టారెంట్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
దిశ, ఉప్పల్: నూతన సంవత్సరం 2025 వేడుకలు మాదకద్రవ్యాల వ్యతిరేక విధానాన్ని దృష్టిలో ఉంచుకుని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సూచనల మేరకు డీసీపీ మల్కాజ్‌గిరి పీవీ పద్మజ పర్యవేక్షణలో మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి, ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేవ్ పబ్, ఎస్‌వీఎం బార్ అండ్ రెస్టారెంట్, సూరపానం బార్ అండ్ రెస్టారెంట్, మయూరి బార్ అండ్ రెస్టారెంట్‌లను సందర్శించి డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఉప్పల్ లో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు హోటల్స్‌ల లైసెన్స్‌లను పోలీసులు తనిఖీ చేశారు. బార్లు పబ్బులలో సౌండ్ పొల్యూషన్ లైసెన్స్, పోలీస్ పర్మిషన్, జీహెచ్ఎంసి పర్మిషన్‌లను పోలీసులు చెక్ చేశారు.అనంతరం పబ్, బార్లలో మైనర్లకు అనుమతిచ్చి లిక్కర్ సప్లై చేస్తే బార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.బార్లు,పబ్బులలో గంజాయి డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. నూతన సంవత్సర వేడుకలు నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని పోలీసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు కోటేశ్వర్‌రావు, మాధవరెడ్డి, డాగ్ స్క్వాడ్ బృందం తదితరులు పాల్గొన్నారు.