కమ్మర్ పల్లి లో దొంగల బీభత్సం

by Naveena |
కమ్మర్ పల్లి లో దొంగల బీభత్సం
X

దిశ, కమర్ పల్లి: మండల కేంద్రంలో పలు ఇళ్లల్లో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించింది. తాళం ఉన్న ఇండ్లను టార్గెట్ గా చేసి దొంగతనానికి పాల్పడ్డారు. కమ్మర్ పల్లి కి చెందిన కలల శ్రీలేఖ, సిరిగిరి శ్రీనివాస్ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. శ్రీలేఖ సోమవారం ఇంటికి తాళం వేసి ఆమె తల్లి గారి ఇంటికి ఖానాపూర్ కి వెళ్లింది. బుధవారం ఉదయం చూడగా గుర్తుతెలియని దొంగలు తాళం పగలగొట్టి బీరువాలో నుంచి అర తుల బంగారం ఉంగరం, 18 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదును దొంగిలించారు. అలాగే సిరిగిరి శ్రీనివాస్, చింత గణేష్ ఇళ్ల తాళాలు పగలగొట్టారని,వారి ఇండ్లలో ఏం పోలేవని తెలిపారు. దీంతో కమ్మర్ పల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. శ్రీలేఖ దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కమ్మర్ పల్లి ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. దొంగతనం జరిగిన స్థలాన్ని భీంగల్ సీఐ నవీన్ కుమార్, కమ్మర్ పల్లి ఎస్సై అనిల్ రెడ్డి పరిశీలించారు.

Advertisement

Next Story