రోడ్ల నిర్మాణానికి నిధులివ్వండి

by Naveena |
రోడ్ల నిర్మాణానికి నిధులివ్వండి
X

దిశ, మక్తల్: నియోజకవర్గంలోని మక్తల్, మగనూర్, నర్వ, కృష్ణ, ఉట్కూర్, అమరచింత,ఆత్మకూర్ మండలాల్లోని పలు గ్రామాలకు బీటీ రోడ్ల కోసం 47కోట్ల నిధులను మంజూరు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వినతిపత్రం అందించారు. దీంతో స్పందించిన మంత్రి సీతక్క నిధులు మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల పరిధిలో పలు మారుగ్రామాల నుండి మండల కేంద్రాలకు రోడ్డు వ్యవస్థ లేక గ్రామ ప్రజలు త్రీవం ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు గ్రామీణ రోడ్ల వ్యవస్థను పట్టించుకోనందున గ్రామాలకు రోడ్డు వ్యవస్థ లేక గ్రామంలో ని ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారన్నారు. ఆయా మండలాల్లోని కోత్త రోడ్లను, ప్రస్తుతం గుంతల రోడ్లను బాగుచేస్తామని హమి ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో మంత్రికి మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed