Telangana New High Court : 100 ఎకరాల్లో తెలంగాణ నూతన హైకోర్ట్

by M.Rajitha |
Telangana New High Court : 100 ఎకరాల్లో తెలంగాణ నూతన హైకోర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ నూతన హైకోర్ట్(Telangana New High Court) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. హైదరాబాద్(Hyderabad) నగర శివారులోని రాజేంద్ర నగర్లో(RajendraNagar) 100 ఎకరాల్లో ఈ నూతన హైకోర్ట్ ను నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి మొత్తం రూ.2583 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సివిల్ పనుల కోసం రూ.1980 కోట్లు, మిగిలిన పనుల కోసం రూ.603 కోట్లు ఖర్చు చేయనున్నారు. కాగా ఈ పనుల నిర్మాణాలకు వచ్చేనెలలో టెండర్లు పిలవనున్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed