వ్యక్తి మరణానికి కారణమైన కేసులో ఒకరికి ఏడాది జైలు

by Sridhar Babu |
వ్యక్తి మరణానికి కారణమైన కేసులో ఒకరికి ఏడాది జైలు
X

దిశ, ఆసిఫాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణానికి కారణమైన కేసులో ఒకరికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి జక్కుల అనంత లక్ష్మి బుధవారం తీర్పునిచ్చారు. రెబ్బెన సీఐ బుద్దె స్వామి తెలిపిన వివరాల ప్రకారం ఆసిఫాబాద్ లోని బజారు వాడి లో నివాసముంటున్న పడిగెల విజయ్ కుమార్ తన భార్య అరుణతో కలిసి 30.09 2019న కాగజ్ నగర్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రాత్రి కైరుగాం గ్రామానికి చెందిన మానేం విజయ్ కారులో అతివేగంగా వచ్చి వారిని ఢీకొట్టడంతో పడిగెల విజయ్ అక్కడికక్కడే మరణించాడు. భార్య అరుణ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా నేరం రుజువు కావడంతో నిందితుడికి ఏడాది పాటు జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Advertisement

Next Story