- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేరాల నియంత్రణకై కమ్యూనిటీ కాంటాక్ట్ : ఎస్పీ చెన్నూరి రూపేష్
దిశ, సంగారెడ్డి : నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డన్ అండ్ సర్చ్) నిర్వహించడం జరుగుతుందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో సంగారెడ్డి పట్టణం, నారాయణ రెడ్డి కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంగారెడ్డి టౌన్, నారాయణరెడ్డి కాలనీని 100 మంది పోలీసులతో చుట్టూ ముట్టి లోపల వ్యక్తులు బయటకు వెళ్ళకుండా, బయటి వ్యక్తులు లోపలికి రాకుండా ఒక కాంచె లాగా ఏర్పాటు చేసి, ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు.
సంగారెడ్డి పట్టణంలో గల వివిధ పరిశ్రమల్లో పని చేయడానికి ఇతర రాష్ట్రాల నుండి ఉపాదికి వచ్చే మైగ్రేట్ లేబర్ అధిక సంఖ్యలో నివాసం ఉంటారని, సరైన గుర్తింపు కార్డ్ లేని వ్యక్తులను, సరైన పత్రాలు లేని వాహనాలను 42 బైక్స్ మరియు 3ఆటోలను అదుపులోకి తీసుకోవడం జరగిందని అన్నారు. మీ చుట్టూ జరిగే నేరాల గురించి అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద, అపరిచిత వ్యక్తులపై నిఘా ఉంచాలని, అసాంఘీక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై జిల్లా పోలీసు శాఖ ఎస్-క్యాబ్ నెంబర్ 8712656777 లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్, రూరల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, జోగిపేట సీఐ అనిల్, కొండాపూర్ సీఐ వెంకటేశం, సబ్-డివిజన్ ఎస్ఐలు, ట్రైనీ ఎస్ఐలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.