- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనా మాంజా అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్..రిమాండ్..
దిశ, కార్వాన్ : నిషేధించబడిన చైనా మాంజా ను సరఫరా చేసి అమ్మకాలు జరుపుతున్న ముగ్గురు వ్యక్తులను సౌత్ అండ్ వెస్ట్ జోన్, ఆసిఫ్ నగర్ పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన శనివారం ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆసిఫ్ నగర్ ఏసీపీ విజయ్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిషేధించబడిన చైనా మాంజాను బొంబాయి నుంచి తీసుకువచ్చి మంగళ్ హాట్, దత్తాత్రేయ నగర్, బైటక్ ప్రాంతానికి చెందిన వినయ్ రాజ్ సింగ్, అనూప్ సింగ్, శంకర్ సింగ్ లు ముగ్గురు వేరు వేరు ప్రాంతాల్లో సరఫరా చేస్తూ అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో సౌత్ అండ్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఆసిఫ్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నారు. వారిని విచారించగా చైనా మంజాను అమ్ముతున్నట్లు తేలింది. వారి వద్ద 426 చైనా మాంజా బాబిన్స్ లను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఎవరైనా నిషేధించబడిన చైనా మాంజాను అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. చైనా మాంజాను పట్టుకున్న సౌత్ అండ్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పాటు ఆసిఫ్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందిని అభినందించారు.