- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెట్రో విస్తరణకు చురుకుగా సన్నాహాలు
దిశ, సిటీబ్యూరో: ఓల్డ్ సిటీలో మెట్రో మార్గంలో రోడ్డు విస్తరణకు సంబంధించిన భూసేకరణ వేగవంతం అయిందని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, హెచ్‌ఏఎంఎల్ అధికారులు ప్రభావిత ఆస్తుల యజమానులతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారన్నారు. తదనుగుణంగా, సేకరించే ఆస్తుల నష్టపరిహారం చదరపు గజానికి రూ.81,000 ఇవ్వాలని హైదరాబాద్ కలెక్టర్ నిర్ణయించినట్లు తెలిపారు. మెట్రో ప్రయాణికుల కోసం ప్రత్యేక ధరలతో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించడానికి ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్‌తో ‘రాపిడో’ శనివారం ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ పనులు వేగవంతంగా చేపట్టాలని ధృడ నిశ్చయంతో ఉన్నారని, అందుకు అనుగుణంగా ఓల్డ్ సిటీ లో భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి పనులు ప్రారంభించనున్నామన్నారు. ఇప్పుడు నిర్ణయించిన నష్టపరిహారానికి అనుగుణంగా ఆస్తుల యజమానులు కొందరు ఇప్పటికే తమ అంగీకార పత్రాలను సమర్పించారని, వారికి 10 రోజుల్లోగా నష్టపరిహారం నేరుగా చెక్కు రూపంలో చెల్లిస్తామని స్పష్టం చేశారు. మిగిలిన ఆస్తుల యజమానులు కూడా వీలైనంత త్వరలో తమ అంగీకార పత్రాలను హెచ్ఏఎంఎల్ కార్యాలయానికి అందజేస్తే వారికి కూడా త్వరలోనే నష్టపరిహారాన్ని చెక్కుల ద్వారా చెల్లిస్తామన్నారు.
మెట్రో ప్రయాణికులకు సౌలభ్యంగా చేరేలా ప్రణాళికలు..
హైదరాబాద్ మెట్రో రైల్, రాపిడో మధ్య భాగస్వామ్యం హైదరాబాద్‌లో అర్బన్ మొబిలిటీ ఇంకా మెరుగుపరచడంలో తమ నిబద్ధతకు ఉదాహరణ అన్నారు. క్లిష్టమైన మొదటి, చివరి-మైలు కనెక్టివిటీ సవాళ్లను పరిష్కరించడం ద్వారా, ఈ చొరవ, నగర ప్రయాణికులకు కీలకమైన లైఫ్‌లైన్‌గా మెట్రో రైలు స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. స్థిరమైన, సమర్థవంతమైన ప్రజా రవాణా లక్ష్యంగా తాము చేస్తున్న ప్రయత్నాలలో ఇదొక ముఖ్యమైన చొరవ అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులను తమ గమ్యాలకు చేర్చే రాపిడో లాంటి వాహన సేవలు మహిళలకు కూడా తగు ప్రాధాన్యత కల్పించి, వారిని కూడా పైలట్‌లుగా భాగస్వాములయ్యేలా కృషి చేయాలని సూచించారు. దీంతో మహిళలలో భద్రతా భావం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సీవోవో మురళీ వరదరాజన్, రాపిడో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పవన్ దీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.