Shocking: చత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు.. డెడ్ బాడీతో శృంగారంలో పాల్గొంటే శిక్ష లేదు

by Ramesh Goud |
Shocking: చత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు.. డెడ్ బాడీతో శృంగారంలో పాల్గొంటే శిక్ష లేదు
X

దిశ, వెబ్ డెస్క్: చత్తీస్‌గఢ్ హైకోర్టు(Chhattisgarh High Court) సంచలన తీర్పు(Sensational Verdict) వెళువరించింది. మృతదేహంతో శృంగారంలో(Sex With A Dead Body) పాల్గొన్నందుకు శిక్ష(Punishment) విధించే నిబంధన లేదని(No Provision) చెప్పి, నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. గరియాబంద్ జిల్లాకు(Gariabandh District) చెందిన తొమ్మిదేళ్ల బాలికను నితిన్ యాదవ్, నీలకంఠం గణేష్ అనే వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడి, అత్యాచారం చేశారు. దీనిపై ట్రయల్ కోర్టు హత్య, ఇతర నేరాలకు పాల్పడిన ప్రధాన నిందితుడు నితిన్‌ యాదవ్ కు ట్రయల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, సాక్ష్యాలను నాశనం చేసినందుకు సహ నిందితుడు నీలకంఠం నగేష్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

కానీ శవంపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని నిర్దోషిగా తీర్పునిచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన కేసులో ట్రయల్ కోర్టు(Trial court) నిర్ణయాన్ని ఆమె తల్లి హైకోర్టులో సవాలు చేశారు. ఈ కేసులో చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా(Chief Justice Ramesh Sinha), జస్టిస్ బిభు దత్తా గురు(Justice Bibhu Dutta Guru)లతో కూడిన ధర్మాసనం హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును సమర్ధిస్తూ.. చనిపోయిన బాలిక తల్లి పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అంతేగాక భారతీయ చట్టంలో శవంతో లైంగిక సంపర్కానికి శిక్ష విధించే నిబంధన లేదని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed