Kiccha Sudeep: ఇంగ్లీష్‌లో టైటిల్ ఎందుకు పెట్టారంటూ ప్రశ్న.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన సుదీప్

by Hamsa |   ( Updated:2024-12-22 06:55:04.0  )
Kiccha Sudeep: ఇంగ్లీష్‌లో  టైటిల్ ఎందుకు పెట్టారంటూ ప్రశ్న.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన సుదీప్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) గత ఏడాది ‘కబ్జా’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. మళ్లీ ఏడాది తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యాక్స్’(Max). విజయ్ కార్తికేయ(Vijay Karthikeya) దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar), సంయుక్త, సునీల్(Sunil), సుకృత్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. Vijay Karthikeyaఈ క్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో కిచ్చా సుదీప్ బిజీ అయిపోయారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను ఓ విలేకరి.. ‘‘మీరు కన్నడ నటుడు అయి ఉండి.

ఇంగ్లీష్‌లో టైటిల్ ఎందుకు పెట్టారు? అంత అవసరం ఉందా?’’ అని ప్రశ్నించగా.. దానికి సుదీప్ స్పందింస్తూ.. ‘‘మీడియా మైక్‌ల్లో చాలా వరకూ పేర్లు ఇంగ్లీష్‌లోనే ఎందుకు ఉన్నాయి. ప్రేక్షకులకు ఇంటర్వ్యూలు చేసే వారికి నేను కన్నడలో మాట్లాడుతున్నా కాబట్టి కన్నడ నటుడినని తెలుసు. అయితే కర్ణాటక(Karnataka)లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ అందులో చదువుకుంటున్న వారు కన్నడిగులు. అసలు మీ సమస్య ఏంటి? ఇంగ్లీష్‌లో ఏ ఫర్ యాపిల్ అని చెబుతారు కదా. మరి కన్నడలో ఏమంటారో చెప్పండి’’ అని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం సుదీప్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారంతా దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు సూపర్ అని అంటున్నారు.

Advertisement

Next Story