- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఓ వైపు భారీ భూకంపం.. మరోవైపు పార్క్‌లో మహిళకు పురిటినొప్పులు.. చివరికి ఏం జరిగిందంటే..?

దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు భారీ భూకంపం (Earthquake) బ్యాంకాక్ నగరం (Bangkok city)లో ప్రకంపణలు ప్రజలను ఆందోళనకు కలిగించగా.. పార్క్‌లో మహిళకు పురిటినోప్పులతో ఓ మహిళా స్ట్రెచర్ పైనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మయన్మార్ (Myanmar)లో సంభవించిన భారీ భూకంపం (Earthquake) కారణంగా శుక్రవారం బ్యాంకాక్, తాయిలాండ్ (Bangkok, Thailand)లలో భారీ ప్రకంపణలు సంభవించాయి. భూ ప్రకంపణల (Earthquakes) నేపథ్యంలో..BNH ఆసుపత్రి, కింగ్ చులాలాంగ్‌కార్న్ మెమోరియల్ ఆసుపత్రి (King Chulalongkorn Memorial Hospital) నుండి రోగులను ఒక పార్కుకు తరలించారు. వారిలో కొందరిని స్ట్రెచర్లు, వీల్‌చైర్‌లలో బయటకు తీసుకువచ్చారు.
అయితే ఓ వైపు భూ ప్రకంపణలతో ఆస్పత్రి మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. దీంతో పార్కులోనే రోగులకు డాక్టర్లు సిబ్బంది చికిత్స అందించారు. ఈ క్రమంలో ఓ మహిళకు ఒక్కసారిగా పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. దీంతో ఆస్పత్రిలోకి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. పార్కులోనే.. స్ట్రెచర్ (stretcher) పై డాక్టర్లు మహిళకు ప్రసవం (woman gives birth) చేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా మయన్మార్, బ్యాంకాక్ ప్రాంతాల్లో వచ్చిన భారీ భూకంపం కారణంగా ఇప్పటి వరకు 700 మంది మృతి (700 people died) చెందినట్లు తెలుస్తుండగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక రిపోర్టులు తెలుపుతున్నాయి.