- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ATM: ఏటీఎం నుంచి ఎన్నిసార్లు క్యాష్ విత్ డ్రా చేస్తే ఛార్జీలు కట్టాలి? ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది?

దిశ, వెబ్ డెస్క్: ATM Cash Withdrawal Charges: ఏటీఎం ట్రాన్సాక్షన్స్ మరింత భారంగా మారనున్నాయి. ఎందుకంటే ఆర్బిఐ కొత్త నిబంధన తీసుకువచ్చింది. మే 1, 2025 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఏటీఎం ట్రాన్సక్షన్లకు బ్యాంకులు గరిష్టంగా రూ. 23ఛార్జీలు వసూలు చేయడానికి ఆర్బిఐ అనుమతి ఇచ్చింది. గతంలో రూ. 21న ఉన్న గరిష్ట రుసుము ఇప్పుడు రూ. 23కి పెంచింది. ఇక నెలలవారీ ఉచిత టాన్సక్షాన్స్ లిమిట్ ముగిసిన తర్వాత రుసుములు వర్తిస్తాయి. మే 1, 2025 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానుంది. ప్రతి లావాదేవికి రూ. 23 వసూలు చేయడానికి బ్యాంకులను అనుమతించింది. గతంలో ఇది 2 1రూపాయలుగా ఉండేది.
ఈ ఛార్జీలు నెలకు ఐదు ఫ్రీ ట్రాన్సాక్షన్స్ గడువు ముగిసిన తర్వాత మాత్రమే వర్తిస్తాయి. ఫ్రీ ట్రాన్సాక్షన్స్ మునుపటిలాగే ఉంటాయి. సొంత బ్యాంకు ఏటీఎం నుంచి నెలకు 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. వేరే బ్యాంకు ఏటీఎం నుంచి అయితే మెట్రో నగరాల్లో 5ఫ్రీ ట్రాన్సాక్షన్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంలో మూడు ఫ్రీ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. ఆర్బిఐ, ఎన్పీసీఐ ఏటీఎం లావాదేవీ ఛార్జీలను రూ. 2పెంచడానికి అంగీకరించాయి. దీంతో మొత్తం 23కి చేరుకుంది. ఎన్పీసీఐ ఈ సమాచారాన్ని మార్చి 13న బ్యాంకులకు తెలిపింది. ఈ కొత్త రుసుము మే 1,2025 నుంచి అమల్లోకి రానుంది. మార్చి 6, 2024న జరిగిన సమావేశంలో ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించారు.
ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఫీజులను పెంచాలని ఆపరేటర్లు డిమాండ్ చేశారు. జూన్ 13,2024న ఏటీఎం ఆపరేటర్ల సంఘం లావాదేవీ ఫీజులను రూ. 23కి పెంచాలని ప్రతిపాదించింది. దీని వల్ల ఏటీఎం పరిశ్రమ లాభదాయకంగా మారుతుందని తెలిపింది. ఈ డిమాండ్ కు అనుగుణంగా ఆర్బిఐ ట్రాన్సాక్షన్స్ ఫీజులను పెంచింది. అయితే వినియోగదారులు తమ బ్యాంకు ఏటీఎంలో నెలకు 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చని ఆర్బిఐ తెలిపింది. మొదటి ఐదుసార్లు డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఫీజు ఉండదు.