Earthquake: రాష్ట్రంలో మరోసారి భూకంపం.. తీవ్ర భయాందోళనకు గురైన జనం

by Shiva |   ( Updated:2024-12-22 06:21:39.0  )
Earthquake: రాష్ట్రంలో మరోసారి భూకంపం.. తీవ్ర భయాందోళనకు గురైన జనం
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వరుస భూకంపాలు (Earthquake) ప్రజలను కలవరపెడుతున్నాయి. తాజాగా, ప్రకాశం (Prakasam) జిల్లా పరిధిలోని ముండ్లమూరు (Mundlamuru) మండలం కేంద్రంగా మరో భూ ప్రకంపనలు సంభవించాయి. సుమారు 2 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో జనం ఇళ్లలోంచి భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా, శనివారం కూడా ఇదే జిల్లాలోని తుళ్లూరు మండల (Tullur Mandal) పరిధిలో సుమారు 2 నంచి 3 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శంకరాపురం (Shankarapuram), పోలవరం (Polavaram), పసుపుగల్లు (Pasupugallu)లో భూమి కంపించినట్లుగా గ్రామస్తులు తెలిపారు.

అదేవిధంగా ముండ్లమూరు (Mundlamuru) మండల పరిధిలోని ముండ్లమూరు, వేంపాడు (Vempadu), మారెళ్ల (Marella), తుర్పు కంభంపాడు (Toorpu Kambhampadu), శంకరాపురం (Shankarapuram)లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. ముఖ్యంగా ముండ్లమూరు (Mundlamuru) పాఠశాలలో విద్యార్థులు భయంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులు సైతం భయంతో వణికిపోయారు. వరుసగా రెండో రోజు కూడా ముండ్లమూరు (Mundlamuru) మండల పరిధిలో భూకంపం రావడంతో అసలు ఏం జరుగుతోందని జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed