KTR: కాళేశ్వరంపై అర్థంలేని కక్ష.. పోతున్న తెలంగాణ పరువు: కేటీఆర్

by Ramesh N |
KTR: కాళేశ్వరంపై అర్థంలేని కక్ష.. పోతున్న తెలంగాణ పరువు: కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Palamuru-Ranga Reddy Project) పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను వెనక్కి పంపిస్తూ కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) సంచలన నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు కురిపించారు. (Kaleshwaram project) కాళేశ్వరంపై అర్థంలేని కక్ష.. పాలమూరు రంగారెడ్డికి ఉరి శిక్ష అంటూ పోస్ట్ చేశారు. కృష్ణాలో తెలంగాణ నీటి వాటా గురించి పాలమూరు బిడ్డ నోరు తెరవడం లేదన్నారు.

పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీలు ఎత్తుకెళ్లినా ప్రభుత్వానికి పట్టడం లేదని తెలిపారు. కాళేశ్వరం నుంచి అదనపు టీఎంసీని తరలించేందుకు కేంద్రం ఆంక్షలు విధించినా కాంగ్రెస్‌లో చలనం లేదని ఆరోపించారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కరువు.. ఏడాది కాంగ్రెస్ పాలనలో పోతున్న (Telangana) తెలంగాణ పరువు.. జాగో తెలంగాణ జాగో.. అంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

Next Story