- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sandhya Theater Incident : సంధ్య థియేటర్ ఘటనలో సంచలన నిజాలు బయట పెట్టిన ఏసీపీ
దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్(Sandhya Theater) ఘటనలో చిక్కడపల్లి ఏసీపీ రమేష్ సంచలన నిజాలు బయట పెట్టారు. తొక్కిసలాట జరిగిన విషయం చెప్పి, అల్లు అర్జున్(Allu Arjun) బయటికి వెళ్లాలని సూచించినప్పటికీ, తాము సినిమా చూశాకే బయటికి వెళ్తామని తెలిపినట్టు పేర్కొన్నారు. కాసేపటి తరువాత డీసీపీ ఆదేశాల మేరకు అల్లు అర్జున్ ను బయటికి తీసుకు వచ్చామని, అనంతరం బయట ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారని వెల్లడించారు. పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ(Assembly Sessions) వేదికగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తొక్కిసలాటకు అల్లు అర్జున్ రోడ్ షో కారణమని, హీరో బాధ్యత లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ మీడియా సంవేశం నిర్వహించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. పోలీసుల సహాయంతోనే తాను థియేటర్ లోపలికి వెళ్లానని, ఎలాంటి రోడ్ షో చేయలేదని వెల్లడించారు. తాజాగా ఈ విషయంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) ఓ వీడియో విడుదల చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, న్యాయపరమైన సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామని మీడియాకు తెలిపారు.
Read More : OU JAC : అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ..రాళ్లతో దాడి