- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య చేసిన పనికి భర్త ఆత్మహత్య..
దిశ, నాగర్ కర్నూల్ : కట్టుకున్న భర్తకు తెలియకుండా భార్య అప్పు చేసింది. తీరా డబ్బులు ఇచ్చిన వ్యక్తి మందలించడంతో భర్త ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మధుర నగర్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం జిల్లా కేంద్రంలోని మధుర నగర్ కాలనీకి చెందిన గున్న ముత్యాలు (56), రజిత ఇద్దరు భార్యభర్తలు. ముత్యాలు జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ ఆఫీస్ లో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
భార్య కొన్ని రోజులు నర్సు ఉద్యోగం చేసి మానేసింది. ఈ క్రమంలో అతని భార్య రజిత భర్తకు తెలియకుండా లక్ష యాభై వేలు ఒక వ్యక్తి దగ్గర అప్పు చేసింది. ఆ వ్యక్తి శనివారం ముత్యాలు ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాలి అని గట్టిగా నిలదీయడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు గమనించి కిందికి దింపారు. వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స తీసుకుంటూ ఆదివారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తల్లి అంజనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.