- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాక్సింగ్ డే టెస్టు అలా మొదలైంది.. ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా?
దిశ, స్పోర్ట్స్ : ఈ నెల 26 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌ను ‘బాక్సింగ్ డే టెస్టు’అని కూడా పిలుస్తారు. క్రికెట్‌లో బాక్సింగ్ డే టెస్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆసిస్, భారత్ మ్యాచ్ నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్టు గురించి అభిమానులు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఆ మ్యాచ్‌కు బాక్సింగ్ డే టెస్టు అని పేరు ఎందుకు వచ్చింది?.. డిసెంబర్ 26నే ఎందుకు ఆ మ్యాచ్ ప్రారంభమవుతుంది.?అనే విషయాలు తెలుసుకుందాం..
బాక్సింగ్ డే అంటే?
బాక్సింగ్ డే టెస్టు గురించి తెలియాలంటే ముందు బాక్సింగ్ డే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. కిస్మస్ బాక్స్ పేరు మీదుగా బాక్సింగ్ డే వచ్చింది. ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు. మరుసటి రోజు డిసెంబర్ 26ను బాక్సింగ్ డేగా పిలుస్తారు. డిసెంబర్ 26ను బాక్సింగ్ డే అని ఎందుకు పిలుస్తారనే విషయమై అనేక కథనాలు ఉన్నాయి. చాలా దేశాల్లో క్రిస్మస్ రోజున సెలవు తీసుకోకుండా పనిచేసిన ఉద్యోగులకు యజమానులు మరుసటి రోజు బాక్స్‌ల్లో బహుమతులు ఇస్తుంటారు. అందుకే డిసెంబర్ 26ను బాక్సింగ్ డే అని పిలుస్తారనేది ఒక కథనం. పేదల కోసం చందాలు సేకరించి వాటిని క్రిస్మస్ మరుసటి రోజున చర్చిల్లో ఉంచుతారు. అందువల్ల కూడా బాక్సింగ్ డే పేరు వచ్చిందని మరో కథ. బ్రిటన్ గర్వించదగ్గ నావికా సంప్రదాయం నుంచి వచ్చిందని కొందరు నమ్ముతారు. సుదీర్ఘ ప్రయాణాలు విజయవంతమైతే దానిని పేదలకు పంచుతారు. ఇలా బాక్సింగ్ డే గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. బాక్సింగ్ డే రోజున జరిగే టెస్టులను బాక్సింగ్ డే టెస్టుగా పిలుస్తుంటారు.
1865లో తొలి మ్యాచ్
బాక్సింగ్ డే టెస్టు మొదటిసారి 1865లోనే జరిగింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో విక్టోరియా, న్యూసౌత్ వేల్స్ మధ్య బాక్సింగ్ డే సందర్భంగా షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ జరిగింది. ఆ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ బాక్సింగ్ డే టెస్టుకు ప్రాముఖ్యత ఉంది. 1950లో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. 1953-1967 మధ్య పలు కారణాలతో బాక్సింగ్ డే టెస్టు జరగలేదు. కానీ, 1980 నుంచి ప్రతి ఏటా మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 26న మ్యాచ్ ప్రారంభమయ్యేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. బాక్సింగ్ డే టెస్టు కేవలం ఆస్ట్రేలియాకే పరిమితం కాలేదు. సౌతాఫ్రికా, న్యూజిలాండ్ దేశాలు కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాయి.
17 మ్యాచ్‌ల్లో నాలుగే విజయాలు
బాక్సింగ్ డే టెస్టుల్లో భారత్‌కు గొప్ప రికార్డు లేదు. 17 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింటి మాత్రమే గెలిచింది. 10 మ్యాచ్‌ల్లో ఓడగా..మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. చివరిసారిగా 2021లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. బాక్సింగ్ డే టెస్టు చరిత్రలో ఆసిస్‌పై కూడా రికార్డు అంతంతే. 1985 నుంచి ఇరు జట్లు మ్యాచ్‌లు ఆడుతున్నాయి. 9 మ్యాచ్‌ల్లో రెండింట విజయాలు సాధించింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో(2018, 2020) టీమిండియాదే గెలుపు.