‘గేమ్ చేంజర్’ నుంచి దోప్ సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన రామ్ చరణ్-కియారా

by Hamsa |
‘గేమ్ చేంజర్’ నుంచి దోప్ సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన రామ్ చరణ్-కియారా
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కియారా అద్వానీ(Kiara Advani) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’(Game Changer). ఈ సినిమాకు శంకర్(Shankar) దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్(Srikanth), సునీల్, అంజలి(Anjali) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ నుంచి ట్రైలర్, పోస్టర్స్, రా మచ్చా, నానా హైరానా, జరగండి సాంగ్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.

అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. నేడు, అమెరికాలోని డల్లాస్‌లో ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించారు. ఇందులో భాగంగా ‘గేమ్ చేంజర్’ నుంచి నాలుగో పాట ‘దోప్’ అంటూ సాగే సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో కియారా, రామ్ చరణ్ వేసిన మాస్ స్టెప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే లిరిక్స్ ఇంగ్లీష్‌లో ఉన్నాయి.



Advertisement

Next Story

Most Viewed