Prime Minister Modi : అశ్విన్ పై ప్రధాని మోడీ ప్రశంసలు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-22 05:36:47.0  )
Prime Minister Modi : అశ్విన్ పై ప్రధాని మోడీ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) ప్రశంసలు కురిపించారు. అశ్విన్ ను అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా లేఖ రాశారు. అశ్విన్ నిర్ణయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ప్రధాని మోడీ లేఖలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మీ నిర్ణయంపై ఆశ్చర్యానికి గురయ్యారని, ఎన్నో ఆఫ్ బ్రేక్స్, క్యారమ్ బంతులతో ప్రత్యర్థులను హడలెత్తించారంటూ మోడీ గుర్తు చేశారు. ఇప్పుడీ రిటైర్మెంట్ నిర్ణయం కూడా క్యారమ్ బాల్ మాదిరిగా ఉందంటూ చమత్కరించారు.

అయితే, ఇలాంటి ప్రకటన చేయడం కూడా అత్యంత కఠినమని అందరికీ తెలుసన్నారు. జట్టు కోసం వ్యక్తిగత జీవితాన్ని నీవు పక్కన పెట్టావని.. మీ అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడూ జట్టు కోసం ఆలోచించావని... చెన్నై వరదలు వచ్చినప్పుడు సాయం చేసేందుకు ముందుకొచ్చావని.. ఇక నుంచి జెర్సీ నంబర్ 99ని మేం మిస్ కాబోతున్నాం" అని మోడీ పేర్కొన్నారు. భారత్ కోసం అద్భుతమైన ప్రదర్శన చేశావని... అందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నానని మోడీ తన లేఖలో తెలిపారు.

Advertisement

Next Story