Kammam: పర్యాటకులకు కనువిందు.. ముక్కోటి నాటికి ట్రైబల్ మ్యూజియం సిద్ధం

by Ramesh Goud |
Kammam: పర్యాటకులకు కనువిందు.. ముక్కోటి నాటికి ట్రైబల్ మ్యూజియం సిద్ధం
X

భద్రాచలం పుణ్యక్షేత్రం వచ్చే భక్తులకు కనువిందు చేసేలా భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయలు ప్రతిభంభించేలా కళాకృతులు పొందుపరుస్తున్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ప్రత్యేక చొరవతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మ్యూజియాన్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. గిరిజనుల జీవన విధానం, వారు ఉపయోగించే వస్తువులు, వారి వస్త్రదారణ ఎలా ఉంటుంది..? ఆదివాసీల వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు, వారి పండుగలు ఉట్టిపడేలా ఈ మ్యూజియం నిర్మాణం సాగుతోంది. గిరిజనులు అంత ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి గల వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో పర్యాటకులు ప్రత్యక్షంగా చూడవచ్చు. పూర్తి గ్రామీణ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముక్కోటి నాటికి మ్యూజియం భద్రాద్రి వచ్చే లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు సందర్శించడానికి సిద్ధం చేస్తున్నారు.

దిశ, భద్రాచలం: సుదూర ప్రాంతాల నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రం వచ్చే భక్తులకు రామయ్య దర్శనం అనంతరం దర్శనీయ స్థలాలు లేకుండా పోయాయి. ఇటువంటి పరిస్థితిలో పర్యాటకులకు కనువిందు చేసేలా భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయలు ప్రతిభంభించేలా కళాకృతులు పొందుపరుస్తున్నారు. గిరిజనులు జీవన విధానం, వారు ఉపయోగించే వస్తువులు, వారి వస్త్ర దారణ ఎలా ఉంటుంది..? ఆదివాసీల వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు, వారి పండుగలు ఉట్టిపడేలా ఈ మ్యూజియం నిర్మాణం సాగుతుంది. అంతే కాకుండా సందర్శించే పర్యాటకులకు అక్కడే గిరిజన వంటలను రుచి చూపించునున్నారు. గిరిజనులు అంత ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి గల వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో పర్యాటకులు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ప్రత్యేక చొరవతో ప్రతిష్టత్మాకంగా తీసుకుని మ్యూజియంను సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. గిరిజనులు నృత్యాలు, పలు వాయుద్య పరికరాలు కూడా ఇప్పటికే సేకరించారు. వారు వేటకు ఉపయోగించే ఆయుధాలు కూడా సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. పూర్తి గ్రామీణ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముక్కోటి నాటికి మ్యూజియం భద్రాద్రి వచ్చే లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు సందర్శించడానికి సిద్ధం చేస్తున్నారు

Advertisement

Next Story

Most Viewed