S Jaishankar: జాతీయ ప్రయోజనాలకు ఏది సరైందో అదే చేస్తాం- జైశంకర్

by Shamantha N |
S Jaishankar: జాతీయ ప్రయోజనాలకు ఏది సరైందో అదే చేస్తాం- జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ, ప్రపంచ ప్రయోజనాలకు అనుగుణంగా ఏది సరైందో అదే చేస్తామని విదేశాంగ మంత్రి జైశంకర్ (External Affairs Minister S Jaishankar ) స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తన ఎంపికలపై భారత్ ఇతరులకు వీటో అధికారం కలిగి ఉండడాన్ని ఎప్పటికీ అంగీకరించదని అన్నారు. జాతీయ, ప్రపంచ ప్రయోజనాల కోసం బెదిరింపులకు గురికాకుండా ఏది మంచిదో ఏదే చేస్తుందన్నారు. అనారోగ్యకరమైన అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, వాతావరణ మార్పులతో ప్రపంచం పోరాడుతోందన్నారు. గ్లోబలైజేషన్(globalisation), టెక్నాలజీల(technology)పై కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది కానీ,భారతీయతను కోల్పోకుండా ముందుకు సాగాలన్నారు. అప్పుడే మనం ప్రపంచంలో అగ్రగామి శక్తిగా ఎదగగలమని చెప్పుకొచ్చారు. భారతదేశం ఇప్పుడు కీలక దశలో ఉందని జైశంకర్(S Jaishankar) అన్నారు. విస్తృత రంగాలలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే నిబద్ధతను కలిగి ఉందని దేశం నిరూపించింది.

చంద్రశేఖరేంద్ర సరస్వతి అవార్డు

ఇకపోతే, జైశంకర్‌కు 27వ ఎస్ఐఈఎస్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్(SIES Sri Chandrasekarendra Saraswati National Eminence Award) అవార్డు లభించింది. ప్రజా నాయకత్వం, కమ్యూనిటీ లీడర్‌షిప్, హ్యూమన్ ఎటెవర్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు సోషల్ లీడర్‌షిప్ అనే నాలుగు రంగాలలో ఈ అవార్డులు ఆధ్యాత్మికతపై ప్రాధాన్యతనిస్తాయి. కంచి కామకోటి పీఠం దివంగత 68వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరు మీద ఈ అవార్డులు అందజేశారు. కాగా.. ఈ కార్యక్రమానికి జైశంకర్ హాజరుకాలేదు. కేవలం వీడియో సందేశాన్నిం పంపాపు.

Next Story

Most Viewed