ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి.. మూసేయ్యడం మా ప్రభుత్వానికి ఇష్టం లేదు: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

by Mahesh |
ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి.. మూసేయ్యడం మా ప్రభుత్వానికి ఇష్టం లేదు: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free bus travel) పై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి(Minister Ramprasad Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం.. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని విజయవంతంగా అందుబాటులోకి(available) తెస్తామని మరోసారి హామి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఇచ్చారు. ప్రతిష్ఠాత్మక ఈ పథకాన్ని ఒకటో తేదీన ప్రారంభించి.. 16న మూసేయడం మాకు ఇష్టం లేదని.. ఈ విషయంలో లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తామని అన్నారు. ఈ ఉచిత బస్సు పథకం అమలయ్యే నాటికి సమస్యలు అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటికే మంత్రులతో కూడిన సబ్‌కమిటీ నియమించామని, ఎవరూ వేలెత్తి చూపించకుండా పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తేల్చి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed