- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టరేట్లో అధికారికంగా జి.వెంకటస్వామి వర్ధంతి..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ఆదివారం అధికారికంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బోధన్ శాసనసభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ముత్తెన్న, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తోందని అన్నారు. స్వర్గీయ వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెంకటస్వామితో తనకు గల అనుబంధాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వర్ధంతి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.