‘నా గురించి అలా సెర్చ్ చేయడం చాలా బాధగా అనిపించింది’.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

by Kavitha |
‘నా గురించి అలా సెర్చ్ చేయడం చాలా బాధగా అనిపించింది’.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బుల్లితెర హీరోయిన్ హీనా ఖాన్ గత కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా తెలుపుతూ ఈ భామ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె తొందరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, తన ఫ్యాన్స్, నెటిజన్లు కోరుకున్నారు. అయితే ఈ స్టేజ్‌లో కూడా ఆమె ఏమాత్రం భయపడకుండా ఒక పక్క కీమోథెరపీ చేయించుకుంటూనే .. అడపాదడపా కెరీర్‌కు సంబంధించిన ఈవెంట్స్‌లో పాల్గొంటూ హ్యాపీగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఇటీవలే గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్-10 నటీనటుల జాబితాలోనూ ఈ బ్యూటీ చోటు దక్కించుకున్నది. అయితే, ఇది తనకు ఏమాత్రం గర్వించదగ్గ విషయం కాదని.. అనారోగ్య పరిస్థితులు వల్ల ఇలా గూగుల్ మోస్ట్ సెర్చ్‌లో ఉండే పరిస్థితి ఎవరికీ రావొద్దని కోరుకుంటున్నట్టు ఇన్‌స్టా‌లో పోస్ట్ పెట్టింది. తానున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో.. తన వర్క్, తన విజయాల గురించి అభిమానులు వెతికి ఉంటే బాగుండేదని, తన గురించి అలా సెర్చ్ చేయడం తనకు చాలా బాధించిందని ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టింది. కాగా హీనా ఖాన్ నిత్యం తన క్యాన్సర్ చికిత్స ప్రయాణాన్ని.. అందులో ఎదురవుతున్న సవాళ్లను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటునే ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed