- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సండే ఎఫెక్ట్.. యాదాద్రి, స్వర్నగిరికి పెరిగిన భక్తుల రద్దీ
దిశ, వెబ్ డెస్క్: నిత్యం పని ఒత్తిడితో ఉండే నగర వాసులు ఇటీవల కాలంలో సమయం దొరికితే కుటుంబ సబ్యులతో గుడుపుతున్నారు. ఈ క్రమంలోనే నగర శివారులో ఉన్న యాదగిరి గుట్ట(Yadagirigutta) ఆలయనాకి సండే వచ్చిందంటే చాలు.. భక్తుల తాకిడి(Clash of devotees) పెరిగిపోతుంది. శుక్రవారం రాత్రి నుంచి భక్తులు పెద్ద మొత్తంలో వస్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున వేల సంఖ్యలో భక్తులు నరసింహస్వామి(Narasimhaswamy)ని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. దీంతో ఈ రోజు ఉదయం అయ్యేసరికి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే యాదగిరి గుట్ట తో పాటు.. మార్గ మద్యమంలో ఉన్న స్వర్నగిరి ఆలయానికి(Swarnagiri Temple) కూడా భక్తుల తాకిడి పెరిగిపోయింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ప్రచారాన్ని పొందిన ఈ కొత్త ఆలయం.. అనతి కాలంలోనే ఫేమస్ అయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో రీల్స్ కారణంగా యువత.. ఈ గుడిని దర్శించడం కోసం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని.. ఫోటోలు వీడియోలు తీసుకుని షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆదివారం కావడంతో భక్తుల తాకిడి పెరిగిపోయింది.