Allu Arjun: అల్లు అర్జున్ విషయంలో తెలుగు నటుల తీరును తప్పు పడుతున్న నెటిజన్స్

by Prasanna |
Allu Arjun:  అల్లు అర్జున్ విషయంలో తెలుగు నటుల తీరును తప్పు పడుతున్న  నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొంత కాలం నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఒకటి ఐపోతుందనుకుంటే .. ఇంకోటి రెడీ అవుతుంది. రాజ్ తరుణ్, జానీ మాస్టర్, హర్ష సాయి, మొన్నటికి మొన్న మోహన్ బాబు ఇంటి గొడవలు ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 ఘటన.

ఈ మూవీ విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, ఓ బాబు కోమాలోకి వెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని శనివారం అసెంబ్లీలో కూడా దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినీ ఇండస్ట్రీపై మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) అసెంబ్లీలో అల్లు అర్జున్ ( Allu Arjun) గురించి మాట్లాడుతూ.. " తెలుగు సినీ ఇండస్ట్రీని తప్పుపట్టారు. అమ్మను కోల్పోయి ఒక పాప ఏడుస్తుంది, ఆస్పత్రిలో ఉన్న పిల్లాడిని చూడటానికి కూడా ఎవరూ వెళ్ళలేదు. కానీ, అల్లు అర్జున్ ఒక్కరోజు జైలులో ఉండి బయటకు రాగానే .. ఆయనకు ఏదో అయిపోయినట్టు.. ఇంటికి వెళ్లి.. షేక్ హ్యాండ్ లు , హాగ్ లు ఇస్తున్నారు .. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఇక్కడ మనం గమనిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో కొంత నిజం ఉంది. అల్లు అర్జున్ కి జరగకూడనది ఏదో జరిగిపోయినట్టు ఆ రోజు ఉదయం నుంచి రెండు మూడు రోజుల వరకు టాలీవుడ్ ప్రముఖులు, పెద్దలు ఇంటికి వెళ్తూనే ఉన్నారు? అసలు ఆ సమయంలో అంత మంది బన్నీ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఒక మనిషి ప్రాణం పోయిందనే కదా అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది? ఇక్కడే కాదు ఏ కేసులోనైనా అదే చేస్తారు కదా.. బెయిల్ రాగానే విడుదల చేశారు.. పోలీసులు తన పని తాను చేసినప్పుడు .. టాలీవుడ్ పెద్దలు, హీరోలు .. అల్లు అర్జున్ దగ్గరకు ఎందుకు వెళ్లాలి? అటు వైపు ఒక ఇంట్లో ఏడుస్తున్నారు .. మరి ఇదే సానుభూతి రేవతి కుటుంబం పై ఎందుకు చూపించలేదు? సినిమాలో లేని ఎమోషన్ కూడా రప్పించుకుని చూపిస్తారు .. మరి ఇక్కడ ఏమైంది? అక్కడ అయితే రెమ్యునరేషన్ ఉంటుంది .. ఇక్కడ అయితే పేమెంట్ ఉండదని రాలేదా? ప్రేక్షకులు వల్లే మీరు కోట్లు సంపాదించగలుగుతున్నారు .. వారు తిరగడబడిన రోజు ఏమి మిగలదంటూ సినీ నటుల పై నెటిజన్స్ మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed