- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
97 బంతుల్లోనే డబుల్ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాటర్ సంచలనం
దిశ, స్పోర్ట్స్ : ఉత్తరప్రదేశ్ కెప్టెన్, బ్యాటర్ సమీర్ రిజ్వి సంచలనం సృష్టించాడు. కేవలం 97 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. అండర్-23 స్టేట్ ఏ ట్రోఫీ టోర్నీలో త్రిపురపై శనివారం ఈ విధ్వంసం సృష్టించాడు. 97 బంతులు ఎదుర్కొన్న అతను 201 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 20 సిక్సర్లు, 13 ఫోర్లు ఉండటం విశేషం. అండర్-23 స్టేట్ ఏ ట్రోఫీ చరిత్రలోనే సమీర్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. అయితే, ఈ ఘనత లిస్ట్ ఏ క్రికెట్ రికార్డు బుక్స్‌లో చేరదు. లిస్ట్ ఏ క్రికెట్‌లో న్యూజిలాండ్‌కు చెందిన చాడ్ బోవ్స్(103 బంతుల్లో) పేరిట ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఉంది. మ్యాచ్ విషయానికొస్తే.. సమీర్ ఊచకోతతో ఉత్తరప్రదేశ్ 4 వికెట్లే కోల్పోయి 405 స్కోరు చేసింది. ఛేదనలో త్రిపు 253/9 స్కోరుకే పరిమితం కావడంతో ఉత్తరప్రదేశ్ 152 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. టోర్నీలో సమీర్‌కు ఇది మూడో శతకం. టోర్నీలో 518 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవల ఐపీఎల్ వేలంలో సమీర్ రిజ్విని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.95 లక్షలకు కొనుగోలు చేసింది.
- Tags
- #Sameer Rizvi