- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
R Krishnaiah : రేవంత్ రెడ్డిది కమీషన్ల ప్రభుత్వం : ఆర్ కృష్ణయ్య
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్‌రెడ్డిది ప్రజా ప్రభుత్వం కాదని, కమీషన్‌ల ప్రభుత్వమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) ఆరోపించారు. కాచిగూడలోని అభినందన్ హోటల్‌లో బీసీ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు అన్యాయం చేస్తే రేవంత్‌రెడ్డి (Revanth reddy) ప్రభుత్వాన్ని తరిమికొడతామని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీ కార్పొరేషన్ (BC Corporations) ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు 90 శాతంతో సబ్సిడీ రుణాలను ఇచ్చి, మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 కుల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని, ప్రతి కార్పొరేషన్‌కు చైర్మన్, పాలకమండళ్ల సభ్యులను ఏర్పాటు చేయాలని సూచించారు. మారుతున్న సమాజంలో బీసీలు ఆర్థికంగా ఎదగడానికి బీసీ కార్పొరేషన్ ద్వారా నిరంతరం రుణాలు అందజేయాలని కోరారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలకు సొంత భవనాలకు నిర్మించాలని డిమాండ్ చేశారు.