- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీబీ నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్.. 26 మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్
దిశ, తెలంగాణ బ్యూరో: టీబీ నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. దేశంలో 2025 నాటికి టీబీని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించిన అన్ని రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీన ఆదిలాబాద్, కొత్తగూడెం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, సూర్యాపేట్, వనపర్తి జిల్లాల్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ 9 జిల్లాల్లో టీబీ రిస్క్ ఉన్న ప్రజలను గుర్తించి, టెస్టులు చేసేందుకు 26 మొబైల్ టీబీ టెస్టింగ్ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని వాహనాల్లోనూ డిజిటల్ ఎక్స్–రే మిషన్లు, సీబీ నాట్ మిషన్లను అందుబాటులో ఉంచామని తెలిపారు.
వంద రోజుల కార్యక్రమానికి సరిపడా టెస్టింగ్ రీఏజెంట్స్, డ్రగ్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు. 9 జిల్లాలో ఇప్పటివరకు 7219 మందికి స్క్రీనింగ్ చేయగా, 181 మందికి టీబీ పాజిటివ్ వచ్చిందని కేంద్ర మంత్రికి దామోదర వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించడం, ఎర్లీ డిటెక్షన్ ద్వారానే టీబీ ఎలిమినేషన్ సాధ్యం అవుతుందని మంత్రి దామోదర అభిప్రాయపడ్డారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణలో టెస్టుల సంఖ్యను భారీగా పెంచామన్నారు. 2023లో 5.74 లక్షల మందికి టీబీ టెస్టులు చేయగా, 2024లో 7.82 లక్షల మందికి టెస్టులు చేశామన్నారు.ట్రీట్‌మెంట్ సక్సెస్ రేటు దేశంలో సగటున 87 శాతం ఉంటే, తెలంగాణలో 90 శాతం ఉందన్నారు. టీబీ పేషెంట్లను వేగంగా గుర్తించి ట్రీట్మెంట్ ను సక్సెస్ ఫుల్‌గా అందించడంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదన్నారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.