- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోతే సినిమా వాళ్ళు బయటకి రావడానికి వీల్లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా తెరకెక్కిన పుష్ప 2 మూవీ విడుదల టైంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, ఓ బాబు కోమాలోకి వెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుని శనివారం అసెంబ్లీలో కూడా దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినీ ఇండస్ట్రీపై మండిపడ్డారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని తెలంగాణాలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని రేవంత్ రెడ్డి తెలిపారు. కాస్తో .. కూస్తో వారికీ బాగా కలిసొచ్చేది బెనిఫిట్ షోల మీదే. ఇది వినగానే టాలీవుడ్ మొత్తం షాక్ కి గురయ్యారు.
తాజాగా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkat Reddy) శ్రీ తేజ్ ఉన్న హాస్పిటల్ కు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద రూ. 25 లక్షల చెక్కును ఆ బాలుడి తండ్రికి అందించారు.
అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. " ఇప్పటి నుంచి తెలంగాణలో నో బెన్ఫిట్ షోస్ .. ఆ స్టార్ అని లేదు .. ఈ స్టార్ అని లేదు .. హీరోలందరూ రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సిందే. పోలీసుల నుంచి పర్మిషన్లు లేకపోతే సినిమా వాళ్ళు బయటకి రావడానికి వీల్లేదు. అలాగే, బయట ఈవెంట్స్, షోలకి వచ్చినప్పుడు ఓపెన్ టాప్ కార్లలో తిరగొద్దు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కానివ్వకుండా చూసుకోండి. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తాం. అందరు హీరోలు, నిర్మాతలు సహకరించాలని " అన్నారు.