- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల
దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఓటీటీ(OTT) హవా కొనసాగుతోంది. నిత్యం కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతివారం ఓ 10 చిత్రాలైనా ఓటీటీలో సందడి చేస్తుంటాయి. ఈ ఏడాదికి ముగింపు పలుకుతూ ఓ థ్రిల్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. సిద్ధార్థ్ విశ్వనాథ్(Siddharth Vishwanath) దర్శకత్వంలో వచ్చిన ‘సొర్గవాసల్’(Sorgavasal) ఓటీటీలోకి రాబోతుంది. ఆర్జే బాలాజీ, సానియా ఇయప్పన్, సెల్వరాఘవన్(Selvaraghavan) కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ నవంబర్ 29న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. డిసెంబర్ 27 నుంచి ‘సొర్గవాసల్’ ఓటీటీలోకి రాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సూపర్ మూవీ అంటూ ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.