- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొల్చారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులతో సమావేశమైన గవర్నర్
దిశ, కొల్చారం: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మండల కేంద్రమైన కొల్చారం లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మెదక్ నుంచి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి అలుగు వర్షిని, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, పాఠశాల విద్యార్థులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. గవర్నర్ రాక సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.. అనంతరం గవర్నర్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ , ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, గురుకుల విద్యాసంస్థల జోనల్ అధికారులు అనంతలక్ష్మి, సక్రు నాయక్ , నోడల్ అధికారులు అనంతలక్ష్మి, సక్రు నాయక్, పాఠశాల ప్రిన్సిపాల్ సత్య కుమారి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.