Flop Movie: సినిమా డిజాస్టర్.. అయినా నేను సంతోషంగా ఉన్నానంటున్న స్టార్ డైరెక్టర్

by Prasanna |
Flop Movie: సినిమా డిజాస్టర్.. అయినా నేను సంతోషంగా ఉన్నానంటున్న స్టార్ డైరెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ డైరెక్టర్ ఒకప్పుడు మంచి సినిమాలు తీసి హిట్స్ కొట్టేవాడు. కానీ, ఇప్పుడు ఆ స్పీడ్ తగ్గింది, జోరు కూడా తగ్గింది యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు తీయలేకపోతున్నాడు. స్టార్ హీరోస్ కి వరుస బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ ( S. Shankar) తీసిన ఇండియన్ 2 ( Indian 2) మూవీ డిజాస్టర్ గా నిలిచింది. తెలుగులో భారతీయుడు సినిమా పెద్ద హిట్ కొట్టింది. కానీ, ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చినా ఇండియన్ 2 ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.

ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. అయితే, దీనిపై మొదటిసారి శంకర్ రియాక్ట్ అయ్యారు. సీనియర్ హీరో కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఇండియన్ 2 మూవీ పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో శంకర్ ఇండియన్ 2 గురించి మాట్లాడాడు.

శంకర్ మాట్లాడుతూ " ఇండియన్ 2 ప్రజలపై చాలా ప్రభావం చూపిందని చెప్పాడు. తెలంగాణలోని ఒక కార్పొరేషన్‌కి చెందిన మహిళా లంచం తీసుకుంటూ ఉండగా, ఆమె భర్త వీడియో తీసి రిపోర్ట్ చేశాడు. అప్పుడు ‘ఇండియన్ 2’ ఎఫెక్ట్ పని చేసిందని అన్నారు. మొత్తానికి నేను అనుకున్నది జరిగింది, దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇండియన్ 2కి నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందని అసలు ఊహించలేదు.. కానీ, అవేం పట్టించుకోకుండా.. నేను నా పనిపై ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్లి పోయాను” అని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed