Priyanka Gandhi : ప్రియాంక ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

by Hajipasha |
Priyanka Gandhi : ప్రియాంక ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
X

దిశ, నేషనల్ బ్యూరో : వయనాడ్(Wayand) నుంచి లోక్‌సభకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) ఎన్నికను సవాల్ చేస్తూ బీజేపీ(BJP) అభ్యర్థి నవ్య హరిదాస్ కేరళ హైకోర్టులో శనివారం పిటిషన్ వేశారు. నామినేషన్ పేపర్లలో ప్రియాంక తప్పుడు సమాచారాన్ని ప్రస్తావించారని ఆమె ఆరోపించారు. వ్యక్తిగత ఆస్తులు, కుటుంబ ఆస్తుల వంటి చాలా ముఖ్యమైన అంశాలను వాటిలో ప్రస్తావించలేదని చెప్పారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లోని వివరాలను నవ్య హరిదాస్ ఆదివారం రోజు విలేకరులకు వెల్లడించారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించడం ద్వారా ఎన్నికల కోడ్‌ను ప్రియాంక ఉల్లంఘించారని ఆమె పేర్కొన్నారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు జనవరిలో వాదనలు వినే అవకాశం ఉందని నవ్య తెలిపారు. జనవరి 5 వరకు కేరళ హైకోర్టుకు సెలవులు ఉన్నాయన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ ఘాటుగా స్పందించారు. పబ్లిసిటీ కోసం పాకులాడే క్రమంలోనే నవ్య హరిదాస్ హైకోర్టులో ఈ పిటిషన్ వేశారని విమర్శించారు. ఆ పిటిషన్ తిరస్కరణకు గురవడమే కాకుండా, ఆమెపై జరిమానా కూడా పడొచ్చని ప్రమోద్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story