- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పార్టీ చేర్యాల పట్టణ అధ్యక్షులుగా దాసరి శ్రీకాంత్..
దిశ, చేర్యాల : కాంగ్రెస్ పార్టీ చేర్యాల పట్టణ అధ్యక్షులుగా పట్టణ కేంద్రానికి చెందిన దాసరి శ్రీకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆదివారం జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తనపైన నమ్మకం ఉంచి పార్టీ పట్టణ అధ్యక్షులుగా నియమించిన డీసీసీ అధ్యక్షులు కొమ్మూరికి ధన్యవాదాలు తెలుపుతూ పట్టణంలో పార్టీ అభివృద్ధికి పాటుపడుతానని, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు.
గతంలో పట్టణ అధ్యక్షులుగా కొనసాగిన మంచాల చిరంజీవులును జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ నియమించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పుర్మ ఆగం రెడ్డి, కౌన్సిలర్ ఆడేపూ నరేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాల లక్ష్మీ నారాయణ, మళ్లీగారి నర్సింహులు, పోతుగంటీ ప్రసాద్ అల్లం రవి తదితరులు పాల్గొన్నారు.