Kriti Sanon: నా చివరి పనిదినాన్ని ముగించా.. కృతి సనన్ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
Kriti Sanon: నా చివరి పనిదినాన్ని ముగించా.. కృతి సనన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) ఈ ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. అలాగే తన హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు హీటెక్కిస్తుంది. తాజాగా, కృతి సనన్ 2024 సంవత్సరానికి ముగింపు పలుకుతూ ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

‘‘నేను 2024లో నా చివరి పని దినాన్ని ముగించాను. నా అద్భుతమైన టీమ్‌ని కలిగి ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాను. అది సంవత్సరాలుగా నాతో ఉంది. సెట్ నుండి సెట్‌కి దూకడం, ఒకరినొకరు నెట్టడం లాంటి పనులు చేసి ఎంజాయ్ చేశాము. అలాగే మంచి చేయడానికి నాకు తోడుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెడు రోజులలో నాకు అన్ని విధాలుగా అండగా ఉండటంతో పాటు అందమైన జ్ఞాపకాలు(Beautiful memories) చేశారు. ఇది నా రెండవ కుటుంబం. మీరు లేకుండా నేను ఏమి చేస్తాను గాయ్స్’’ అని రాసుకొచ్చింది. అలాగే తన స్నేహితులతో నవ్వుతూ ఉన్న ఫొటోలు(Photos) షేర్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed