INDW vs WIW 1st ODI: టాస్ ఓడిన భారత్

by Mahesh |
INDW vs WIW 1st ODI: టాస్ ఓడిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు(Indian Women's Team) తాజాగా వన్డే సిరీస్(ODI series) ఆడుతుంది. ఇందులో భాగంగా నేడు మొదటి మ్యాచ్ వడోదర వేదికగా జరగుతుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు(West Indies team) బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. కాగా దీనికి ముందు టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్ పై కన్నేసింది. అలాగే వెస్టిండీస్ జట్టు కూడా వన్డే సిరీస్ ను ఎలాగైనా గెలవాలనే తపనతో ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో తెలియాలంటే చివరి వరకు వేచి చూడాల్సిందే మరి.

భారత్ ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, సైమా ఠాకోర్, టిటాస్ సాధు, ప్రియా మిశ్రా, రేణుకా ఠాకూర్ సింగ్

వెస్టిండీస్ ప్లేయింగ్ XI: హేలీ మాథ్యూస్ (సి), కియానా జోసెఫ్, షెమైన్ క్యాంప్‌బెల్ (w), డియాండ్రా డాటిన్, రషదా విలియమ్స్, జైదా జేమ్స్, షబికా గజ్నాబి, ఆలియా అలీన్, షామిలియా కన్నెల్, అఫీ ఫ్లెచర్, కరిష్మా రాంహారక్

Advertisement

Next Story

Most Viewed