Minister Sridhar Babu: శ్రీతేజ్‌ను బతికించాలనే మా తాపత్రయం.. అల్లు అర్జున్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

by Shiva |   ( Updated:2024-12-22 03:38:50.0  )
Minister Sridhar Babu: శ్రీతేజ్‌ను బతికించాలనే మా తాపత్రయం.. అల్లు అర్జున్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని, అందులో ఎవరి తప్పు లేదంటూ అల్లు అర్జున్ (Allu Arjun) నిన్న ప్రెస్‌మీట్‌లో అన్నారు. పోలీసుల పర్మీషన్‌తోనే తాను థియేటర్‌కు వెళ్లానని, నేషనల్ మీడియా (National Media) ఎదుట తనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిందలేయడం ఎంతగానో బాధిస్తోందని కామెంట్ చేశారు. తాజాగా, ఆయన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కౌంటర్ ఇచ్చారు. సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద కారుపై నిలబడి అభివాదం చేసేందుకు పోలీసులు అల్లు అర్జున్‌ (Allu Arjun)కు అనుమతి ఇచ్చాలో ఆ విషయం ఆయనకు కూడా తెలుసని అన్నారు.

ప్రస్తుతం ఈ ఇష్యూ కోర్టు పరిధిలో ఉందని ఎక్కువగా మాట్లాడటం సరికాదన్నారు. థియేటర్‌కు పోలీసులు వెళ్లాకే అక్కడి నుంచి అల్లు అర్జున్ కదిలారని ఆరోపించారు. ఓ హీరో మానవీయ కోణం మరిచిపోయారంటూ సీఎ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సభలో తెలిపారని గుర్తు చేశారు. ఇంత జరిగినా.. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉండాల్సిందనేది తమ అభిప్రాయమని అన్నారు. ఎలాగైనా శ్రీతేజ్‌ (Sri Tej)ను బతికించాలనేది తమ తాపత్రయమని పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించలేదనేది సీఎం ఆలోచన అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed