TG Police: బౌన్సర్లు, ప్రైవేటు బాడీ గార్డ్స్‌ పరిమితులపై తెలంగాణ పోలీస్ హెచ్చరిక

by Ramesh N |
TG Police: బౌన్సర్లు, ప్రైవేటు బాడీ గార్డ్స్‌ పరిమితులపై తెలంగాణ పోలీస్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: బౌన్సర్లు, ప్రవేటు బాడీ గార్డ్స్‌కైనా పరిమితులు ఉంటాయని (Telangana Police) తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖ తన ఎక్స్ ఖాతా ద్వారా బౌన్సర్లు, ప్రైవేట్ బాడీ గార్డులపై ఆసక్తికర పోస్ట్ చేసింది. (Bouncers) బౌన్సర్లు, ప్రైవేట్ బాడీ గార్డులు (private bodyguards), వీరిని సమకూర్చే సంస్థలు ప్రభుత్వ, పోలీస్ నిబంధనలకు లోబడి చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది.

బౌన్సర్లు, ప్రైవేట్ బాడీ గార్డ్స్ పేరుతో చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైనైనా దాడులు, బెదిరింపులు చేస్తే (Criminal cases) క్రిమినల్ కేసులతో జైలు ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించింది. పరిమితులు అతిక్రమిస్తే కేసులు వెంటాడుతాయని తెలంగాణ పోలీస్ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed