Heel pain: మార్నింగ్ లేవగానే ఈ సమస్య వేధిస్తోందా? ఈ మూడు ఎక్సర్‌సైజ్‌‌లతో చెక్ పెట్టండి!

by Anjali |
Heel pain: మార్నింగ్ లేవగానే ఈ సమస్య వేధిస్తోందా? ఈ మూడు ఎక్సర్‌సైజ్‌‌లతో చెక్ పెట్టండి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటోన్న సమస్యల్లో పాదాల వద్ద మడమ నొప్పి ఒకటి. మార్నింగ్ లేవగానే అనేక మంది తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. మార్నింగ్ లేవగానే మడమ లోపలి భాగంలో పుండు అయినా మాదిరిలా చాలా ఇబ్బంది పెడుతుంటుంది. దీంతో కాలు కింద పెట్టడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తోన్న ఈ సమస్య రావడానికి మడమ ఎముకలో వాపు, ఆర్థరైటిస్, హైపో థైరాయిడిజం, పాదాల దిగువ భాగంలో వాపు వంటి సమస్యలే కారణమని తాజాగా నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ ఎక్సర్‌సైజ్‌లు చేయాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఐస్ బాటిల్స్‌తో మసాజ్ చేయండి..

ఒక బాటిల్‌లో ఐస్ వాటర్ లేదా ఐస్ ముక్కలను నింపి.. దీన్ని మీ అరికాళ్లపై ఉంచండి. తర్వాత బాటిల్ తో కాళ్లకు మసాజ్ చేస్తే కండరాలు రిలాక్స్ అవుతాయి అంతేకాకుండా ఐస్ కంప్రెస్ మొత్తం అరికాళ్లలో ఉంటుంది. ఇలాగే కొన్ని డేస్ వరకు చేస్తుంటే క్రమంగా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

చీలమండను సాగదీయండి..

ఈ ఎక్సర్‌సైజ్ కోసం ముందుగా రెండు అంగుళాల హైట్ మెట్టుపై నిలబడండి. తర్వాత గోడకు మద్ధతిచ్చి.. ఓన్లీ పాదాలతో మాత్రమే నిల్చొండి. ఇప్పుడు కాలివేళ్లపై నిలబడి.. 15 వరకు అంకెల్ లెక్కబెట్టండి. దీంతో చీలమండ, అరికాళ్ల కండరాలు సాగినట్లుగా అనిపించడంతో పాటు రిలాక్స్ గా ఉంటుంది.

వజ్రాసనంలో వజ్రాసన..

వజ్రాసన భంగిమలో కూర్చోవడం వల్ల మడమ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఆసనంలో తుండి పూర్తిగా నేలపై విశ్రాంతి తీసుకుంటుంది. దీంతో మడిమ మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది. ఫలితంగా అరికాళ్లలో ఆర్చ్ ఏర్పడి మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఆహారంలో జాగ్రత్తలు..

అలాగే మెగ్నీషియం, పొటాషియం, మెటబాలిక్, కాల్షియం గుణాలున్నఇతర ఆహారలు కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో మడమ, పాద కండరాలు బలోపేతం అవుతాయి. అలాగే కాఫీతో పాటుగా మాంసాహార తినడం తగ్గించాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed