IPO: స్టాక్ మార్కెట్లో వచ్చే వారం 3 కంపెనీల ఐపీఓలు సందడి.. మరో 8 లిస్టింగ్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-22 12:29:57.0  )
IPO: స్టాక్ మార్కెట్లో వచ్చే వారం 3 కంపెనీల ఐపీఓలు సందడి.. మరో 8 లిస్టింగ్..!
X

దిశ,వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లో(Stock Market) వచ్చే వారం కూడా ఐపీఓలు సందడి చేయనున్నాయి. డిసెంబర్ నాలుగో వారంలో కొత్తగా 3 కంపెనీలు ఐపీఓ సబ్ స్క్రిప్షన్(Subscription)కు రానున్నాయి. అయితే ఇందులో మెయిన్ బోర్డ్(Main Board) నుంచి ఒక కంపెనీ ఉండగా.. ఎస్ఎంఈ(SME) సెగ్మెంట్ నుంచి రెండు కంపెనీలు రానున్నాయి. ఇక మెయిన్ బోర్డ్ విభాగం నుంచి రాబోతున్న ఏకైక సంస్థ బెంగళూరుకు(Bengaluru) చెందిన స్పేస్ స్టార్టప్ యునిమేక్ ఏరోస్పేస్&మ్యానుఫ్యాక్చరింగ్(UAM) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్(IPO) డిసెంబర్ 23న ప్రారంభమై డిసెంబర్ 26 వరకు కొనసాగనుంది. ఈ సంస్థ ఐపీఓ ద్వారా సుమారు రూ. 500 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్(OFS) కింద రూ. 250 కోట్లను, తాజా షేర్ల(Fresh Issue) ద్వారా రూ. 250 కోట్లను సమీకరించనుంది. కాగా సంస్థ ఒక్కో షేరు ధరను రూ.745 నుంచి గరిష్టంగా రూ. 785గా నిర్ణయించింది. 19 షేర్లకు కలిపి ఒక్కో లాట్ సైజు(Lot Size)గా ప్రకటించింది. ఇక ఎస్ఎంఈ సెగ్మెంట్ నుంచి రాబోతున్న వాటిలో సోలార్-91 క్లీన్ టెక్(Solar91 Cleantech), అన్య పాలిటెక్&ఫెర్టిలైజర్స్(Anya Polytech & Fertilizers) ఐపీఓలు ఉన్నాయి. అలాగే వచ్చే వారం మరో 8 కంపెనీలు దలాల్ స్ట్రీట్ లో లిస్టింగ్ అవ్వనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed