Amit Shah : పేదల పేరుతో కాంగ్రెస్, సీపీఎం బూటకపు రాజకీయాలు : అమిత్‌‌షా

by Hajipasha |
Amit Shah : పేదల పేరుతో కాంగ్రెస్, సీపీఎం బూటకపు రాజకీయాలు : అమిత్‌‌షా
X

దిశ, నేషనల్ బ్యూరో : రెండు దశాబ్దాల పాటు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన మిజోరం‌ రాష్ట్రానికి చెందిన బ్రూ తెగ(Bru migrants) ప్రజలకు పునరావాసం కల్పించిన ఘనత బీజేపీ సర్కారుకే దక్కుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షా(Amit Shah) అన్నారు. మిజోరంలో హింసాకాండకు భయపడి త్రిపురకు వలస వచ్చిన వేలాది బ్రూ తెగ కుటుంబాలను గత కాంగ్రెస్, సీపీఎం ప్రభుత్వాలు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ‘‘మిజోరంలో తెగల మధ్య హింసాకాండ జరగడంతో దాదాపు 32వేల మందికిపైగా బ్రూ తెగ ప్రజలు 1997లో త్రిపురలోకి ప్రవేశించారు. వాళ్లంతా దాదాపు 25 ఏళ్లపాటు దుర్భర పరిస్థితుల్లో జీవనం గడిపారు. నివాసాలు, నీరు, విద్యుత్, విద్య, ఉపాధి వంటివేవీ వారికి దక్కలేదు. కాంగ్రెస్, సీపీఎం ప్రభుత్వాలు వారిని విస్మరించాయి’’ అని కేంద్ర హోంమంత్రి తెలిపారు.

ఎట్టకేలకు త్రిపురలో బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చాక 2020 సంవత్సరం జనవరి 16న బ్రూ తెగకు చెందిన కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ అందుబాటులోకి వచ్చిందన్నారు. పేదల పేరు చెప్పుకొని రాజకీయం చేసే కాంగ్రెస్, సీపీఎంల నిజస్వరూపం ఇదేనని అమిత్‌షా విమర్శించారు. బ్రూతెగకు చెందిన వారి కోసం రూ.900 కోట్ల వ్యయంతో 11 గ్రామాలను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో సకల సౌకర్యాలను కల్పించామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed