- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్.. చాంపియన్స్ ట్రోఫీకి స్టోక్స్ దూరం
దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతోపాటు భారత్ టూరుకు ఇంగ్లాండ్ జట్టు ఖరారైంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్(ఈసీబీ) క్రికెట్ బోర్డు ఆదివారం జోస్ బట్లర్ నేతృత్వంలో 15 మందితో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. బ్యాటర్ జో రూట్ తిరిగి వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. చివరిసారిగా గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భారత్ పర్యటనతోపాటు చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో అతను గాయపడ్డాడు. దీంతో స్టోక్స్ సెలెక్షన్‌కు అందుబాటులో లేడు. భారత పర్యటనలో ఇంగ్లాండ్.. వన్డే సిరీస్‌తోపాటు టీ20 సిరీస్ కూడా ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈసీబీ వన్డే జట్టుతోపాటే టీ20 జట్టును ప్రకటించింది. రూట్ కేవలం వన్డే జట్టుకే పరిమితమవ్వగా.. టీ20 టీమ్‌లోకి స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌కు చోటు దక్కింది. జనవరి 17న ఇంగ్లాండ్ జట్టు భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లాండ్ జట్లు మొదట ఐదు టీ20ల సిరీస్‌లో తలపడతాయి. ఆ తర్వాత మూడు వన్డేలు జరుగుతాయి. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరు జట్లకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడనుంది.
చాంపియన్స్ ట్రోఫీ, భారత్ టూరుకు ఇంగ్లాండ్ వన్డే జట్టు ఇదే
జోస్ బట్లర్(కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డక్కెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జోరూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్‌వుడ్.