Arjun Tendulkar: అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్.. హై స్కోరింగ్ మ్యాచ్‌లో గోవా సూపర్ విక్టరీ

by Shiva |   ( Updated:2024-12-22 04:10:49.0  )
Arjun Tendulkar: అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్.. హై స్కోరింగ్ మ్యాచ్‌లో గోవా సూపర్ విక్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) లో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) అద్భుత బౌలింగ్‌తో మరోసారి అదగొట్టాడు. ఈ సీజన్‌లో గోవా (Goa) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ గ్రూప్-ఏలో భాగంగా ఒడిశా (Odisha)తో జరిగిన మ్యాచ్‌లో 3 కీలక వికెట్లను పడగొట్టాడు. జైపూర్ (Jaipur) వేదికగా శనివారం జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ (3/61) అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో గోవా (Goa) విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్రీజులో కుదరుకున్న ఒడిశా (Odisha) బ్యాట్స్‌మెన్లను ఒక్కడే పెవీలియన్‌కు పంపాడు.

అయితే, అర్జున్ బౌలింగ్ పట్ల సోషల్ మీడియా (Social Media)లో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గోవా (Goa) నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 371 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఇషాన్ గాడేకర్ (96 బంతుల్లో 12 ఫోర్లతో 93), మరో ఓపెనర్ స్నేహ్ (67), కెప్టెన్ దర్శన్ మిసల్ (79), సుయాష్ ప్రభుదేశాయ్(74 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. సుయాష్ ప్రభుదేశాయ్ 22 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఒడిశా 49.4 ఓవర్లలో 344 పరుగులకు చేసింది. దీంతో గోవా జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

Next Story