అల్లు అర్జున్ ప్రెస్ మీట్‌పై స్పందించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

by Mahesh |
అల్లు అర్జున్ ప్రెస్ మీట్‌పై స్పందించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పుష్ప-2 సినిమా తొక్కిసలాటతో పాటు హీరో అల్లు అర్జున్ హాట్ టాపిక్‌గా మారిపోయాడు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం అల్లు అర్జున్ ప్రవర్తన పై సంచలన వ్యాఖ్యలు చేయడం, సినీ ప్రముఖులకు సున్నితంగా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో వెంటనే హీరో అల్లు అర్జున్ తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తొక్కిసలాట ఒక ప్రమాదం మాత్రమే అని.. ఆ ప్రమాదానికి ఎవరూ బాధ్యులు కారని చెప్పుకొచ్చారు.

అలాగే తొక్కిసలాట జరిగిందని చెప్పినా తాను.. రోడ్ షో చేశారని చెబుతున్నారని.. తాను ఎలాంటి రోడ్ షో నిర్వహించలేదని.. అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. కాగా ఈ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గతంలో మద్రాస్ కు పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ తీసుకురావడంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తొక్కిసలాటకు సంబంధించిన ఘటనపై అల్లు అర్జున్ ప్రభుత్వం తనని బద్నాం చేస్తుందని అనడంపై పిసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు. తొక్కిసలాటలో ఒక నిండు ప్రాణం పోయింది. మరో పిల్లాడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఎవరైనా ఆ బాలుడిని పరామర్శించారా.. అని ఓయూలో జరిగి దూమ్ దామ్ వేడుకల సందర్భంగా ఆయన ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed