BRS: అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా..? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
BRS: అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా..? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్:అధికారం ఉందని అసెంబ్లీ(Telangana Assembly) సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు. రుణమాఫీ(Loan Waiver) కాలేదని రైతులు రోడ్డెక్కారని వచ్చిన వార్తపై స్పందిస్తూ.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్.. రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారని, వందశాతం రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని శాసనసభ సాక్షిగా సవాల్(Challenge) విసిరితే స్వీకరించకుండా తోక ముడిచిన ప్రభుత్వం.. రుణమాఫీ కానీ రైతన్నలకు ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకని మండిపడ్డారు. అలాగే రా పోదాం పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి(Indravelli) అని, రా పోదాం అడవుల తల్లి ఆదిలాబాద్(Adilabad) అని, ధనోరా(Dhanora) రోడ్డు మీద కూసున్న రైతుల ముందే మీ మాయల మాఫీ లెక్కలు తేల్చుదాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక రుణమాఫీ మాయ, రైతుభరోసా రూ. 7500 మాయ, తులం బంగారం మాయ, మహిళలకు రూ.2500 మాయ, రూ.4000 ఆసరా ఫించన్లు మాయ, రూ.6000 దివ్యాంగుల ఫించన్లు మాయ అని బీఆర్ఎస్ నేత రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed