- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్టార్ హీరోతో సాంగ్ అనగానే చాలా భయమేసింది.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ రీసెంట్‌గా ‘పుష్ప-2’ సినిమాలో కిస్సిక్ అనే ఐటెమ్ సాంగ్‌లో తన డ్యాన్స్‌తో అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సరసన ‘రాబిన్ హుడ్’ చిత్రంలో నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల ఐకాన్ స్టార్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘బన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతనో డ్యాన్సింగ్ కింగ్. తన సినిమాల్లో నటన ఒక ఎత్తైతే, డ్యాన్స్ మరో ఎత్తు. అయితే ‘పుష్ప-2’ లో ఐటెం సాంగ్ ఎవరు చేస్తారా అనే ఆసక్తి నాకు కూడా ఉండేది. రకరకాల పేర్లు వినిపించినప్పటికీ చివరికి నా పేరు ఖరారైందని తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యా.
కానీ, బన్నితో సాంగ్ అనగానే చాలా భయమేసింది. షూటింగ్‌కి ముందు ఎంతో ప్రాక్టీస్ చేసి సెట్స్‌కి వెళ్లా. నా టెన్షన్‌ని గమనించి, ‘ఇక్కడ నేను అల్లు అర్జున్‌లా డ్యాన్స్ చేయడం లేదు, పుష్పరాజ్‌లా చేస్తున్నా. కాబట్టి భయపడాల్సిన పనిలేదు’ అని చెప్పి నా కంగారును అల్లు అర్జున్ పోగట్టారు. అసలు బన్ని సెట్‌లో ఉంటే తెలియని పాజిటివ్ వైబ్ వస్తుంది. అందర్ని ఉత్సహపరుస్తారు’ అని చెప్పుకొచ్చింది యంగ్ బ్యూటీ శ్రీ లీల. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.