Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం : 22 మంది మృతి

by M.Rajitha |
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం : 22 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రెజిల్‌లోని మినాస్‌ గెరాయిస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 22 మంది మృతి చెందారు. శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సావో పాలో ప్రాంతం నుంచి 45మందితో బయలుదేరిన బస్సు... మినాస్ గెరియిస్​లోని హైవేపై వెళ్తుండగా అకస్మాత్తుగా బస్సు టైరు పేలిపోయింది. దీంతో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోగా.. బస్సు ఓ ట్రక్కును ఢీకొట్టి, ఆ తర్వాత ముగ్గురు ప్రయాణికులతో వెళ్తున్న కారును ఢీకొట్టింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నామని అగ్నిమాపక విభాగం లెఫ్టినెంట్ అలెన్సో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed