రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనంగా వీడ్కోలు

by Mahesh |
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనంగా వీడ్కోలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి శీతాకాల విడిది విజయవంతంగా ముగిసింది. ఈ నెల 17న భారత రాష్ట్రపతి హైదరాబాద్ లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ పనులు, సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ పర్యటన ముగించుకుని శనివారం హకీంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం, ఇతర అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Advertisement

Next Story

Most Viewed