- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త చరిత్రలను సృష్టిస్తున్న అయోధ్య రామ మందిరం
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, యూపీ ప్రభుత్వంతో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా.. అయోధ్య రామ మందిరాన్ని(Ayodhya Ram Mandir) నిర్మించింది. ఎన్నో వివాదాల అనంతరం 500 ఏళ్ల హిందువుల కలను సాకారం చేస్తూ.. జనవరి 22 ప్రధాని మోడీ(Prime Minister Modi) అట్టహాసంగా అయోధ్యలో బాల రాముడి(Ramlalla) విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం 20 రోజుల తర్వాత సందర్శకులు(visitors,), భక్తుల(devotees) దర్శనానికి అనుమతి లభించడంతో ప్రతి రోజు వేల సంఖ్యలో, సెలవుల్లో లక్షల్లో భక్తులు రామ మందిరాన్ని సందర్శిస్తున్నారు. దీంతో అయోధ్య(Ayodhya) రామ మందిరానికి రోజు రోజు భక్తుల తాకిడి పెరిగిపోతుంది. దేశంలో ప్రస్తుతం మొస్ట్ విజిట్(Most visited) ప్రాంతాల్లో అయోధ్య మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ క్రమంలోనే తాజ్‌మహల్(The Taj Mahal) రికార్డును అయోధ్య రామ మందిరం బద్దలుకొట్టింది.
2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 13.55 కోట్ల మంది భారతీయులు అయోధ్యను సందర్శించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం(Uttar Pradesh Govt) ప్రకటన విడుదల చేసింది. అలాగే వీరితో పాటు 3153 మంది విదేశీ పర్యాటకులు(Foreign tourists) అయోధ్య సందర్శించినట్లు పేర్కొంది. ప్రపంచ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన తాజ్‌మహల్‌ను గత సంవత్సర కాలంలో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు కలిపి 12.51 కోట్ల మంది సందర్శించినట్లు సమాచారం. అయితే కేవలం 9 నెలల్లోనే తాజ్‌మహల్ రికార్డును అయోధ్య రామ మందిరం అధిగమించినట్లు యూపీ సర్కార్ స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.